విశాఖ: వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రమంతా పాడిపంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.