ప్రకాశం జిల్లా గిద్దలూరులో బేకరీ దుకాణదారులు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా విక్రయిస్తున్న కేకుల తూకంలో భారీగా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు గుర్తించారు. కేజీ కేకులో ఏకంగా 200 గ్రాములు బరువు తగ్గడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బేకరీ యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయని వారు వాపోతున్నారు.