నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోడేలమిట్ట రైల్వే స్టేషన్ వెనుక కోడిపందేల స్థావరంపై ముత్తుకూరు పోలీసుల సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందెం ఆడుతున్న ఏడుగురు పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.6,000, రెండు కోడి పుంజులు, ఏడు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ రెడ్డి తెలిపారు.