NTR: విస్సన్నపేట పోలీస్ యంత్రాంగం సంక్రాతి పండగ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సోమవారం రాత్రి కోడికత్తులను తయారు చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. కొండపర్వ గ్రామానికి చెందిన వీర్ల శ్రీనివాసరావు (30) నుంచి 400 వందల కోడికత్తులు, తయారీకి ఉపయోగించిన మోటార్‌ను స్వాధీనం చేసుకున్నారు.