SRD: సంగారెడ్డిలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠ పురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు. అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.