EG: జగన్ జన్మదిన వేడుకల్లో జంతు బలి ఇవ్వడంపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..”జగన్ గారూ! మీ ఆడబిడ్డలు లండన్లో చదువుకుంటూ బాగుండాలి.. కానీ ఇక్కడ కార్యకర్తల పిల్లలు మాత్రం కత్తులు పట్టి జంతు బలులు ఇచ్చి కేసులు పెట్టించుకోవాలా?” అని ఫైర్ అయ్యారు.