NLG: ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్’లో వట్టిమర్తికి చెందిన దంపతులు ప్రతిభ చాటారు. అంగన్వాడి టీచర్ ఇందిర స్వయంగా రచించి పాడిన ‘అంగన్వాడి పిల్లలము’ పాటకు, ఆమె భర్త భీష్మచారి దర్శకత్వం వహించారు. నిన్న HYDలో జరిగిన వేడుకలో సినీ ప్రముఖులు దిల్ రాజు, తనికెళ్ల భరణి చేతుల మీదుగా వీరు ప్రశంస పత్రం అందుకున్నారు.