AKP: ఎస్.రాయవరం మండలంలోని పెదగుమ్ములూరు, తిమ్మాపురం, కోరుప్రోలు, గుడివాడ గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను డిప్యూటీ ఎంపీడీఓ బంగారు సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. చెత్త కుప్పలు తొలగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తడి, పొడి చెత్త వేరు చేసి, తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ఆదేశించారు.