TPT: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం రాత్రి వరకు సుమారు 55 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనాల ద్వారా 50 వేల మంది, కాలినడకల్లో 5 వేల మంది వచ్చినట్లు సమాచారం. నేడు దర్శనం ఉన్న భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.