కృష్ణా: చోరంపూడి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుపుతూ, లారీల ద్వారా తరలింపు జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని వారు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని గ్రామస్తులు కోరుతున్నారు.