ప్రకాశం: త్రిపురాంతకంలోని రామసముద్రం గ్రామంలో సోమవారం కోటా ప్రసన్నకుమార్ (26) అనే వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రసన్నకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.