ATP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.