KRNL: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కర్నూలులో పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. అనుమతి లేని బహిరంగ సభలు, మద్యం మత్తులో డ్రైవింగ్, డీజేలు, బైక్ సైలెన్సర్లు తొలగించి తిరగడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.