AP: జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ప్రకటించింది. ఈ నెల 4న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర, 12 అధ్యయనోత్సవాలు సమాప్తి కార్యక్రమం, 13న తిరుమల నంబి సన్నిధికి వేంచేపు, 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ, 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం, 23న వసంత పంచమి, 25న రథ సప్తమి కార్యక్రమాలను నిర్వహించనుంది.