MNCL: మంచిర్యాలకు చెందిన మద్దెల నిత్య కూచిపూడి నృత్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 27న నిర్వహించిన కూచిపూడి కళా వైభవంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. నిత్య గతంలో రవీంద్ర భారతిలో నంది అవార్డు, టీటీడీ పురస్కారం అందుకుంది.