ASR: రాజవొమ్మంగి మండలవ్యాప్తంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. స్థానిక సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటరమణ మంగళవారం వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు చేపడుతున్న ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.