»Dispute Over Distribution Of Kalyana Lakshmi Cheques The High Court Sought The Governments Explanation
High Court: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ వివాదం.. ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో నూతన వధువుకు అందించే కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వలని నేడు హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
High Court: తెలంగాణ రాష్ట్రంలో నూతన వధువకు అందించే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యం జరుగుతోందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలోనే దీనిపై వివాదం అయింది. హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయనీయడం లేదని, ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏ నియోజకవర్గంలోనైనా స్థానిక ఎమ్మెల్యేనే చెక్కుల పంపిణీ చేస్తున్నారని, కానీ తన నియోజకవర్గంలో మాత్రం అలా జరగడం లేదని కోర్టుకు చెప్పారు.
ప్రభుత్వం అధికారులకు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపాలని మంత్రి పొన్నం ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. జూన్ 27 వరకు చెక్కులు పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఆయన వేసిన పిటిషన్ను విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చెక్కుల పంపిణి విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందని అడిగింది. ఇంతవరకు లబ్దిదారులకు చెక్కులు ఎందుకు పంపిణీ చేయలేదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.