లీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె రాసిన కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనేపుస్తకంలోని టైటిల్ వివాదం తీసుకొచ్చింది.
Kareena Kapoor: Madhya Pradesh High Court notices to Kareena
Kareena Kapoor: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం టైటిల్లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కరీనాకి నోటీసు జారీ చేసింది. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది.
పుస్తకం టైటిల్లో బైబిల్ అనే పదాన్ని వాడటానికి కారణం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఈ పుస్తకంపై బ్యాన్ విధించాలని అడ్వకేట్ ఆంథోనీ డిమాండ్ చేశారు. అలాగే ఆ పుస్తక విక్రయదారులపై కూడా కేసు నమోదు చేయాలని నోటీసు జారీ చేశారు. బైబిల్ అనే పదం టైటిల్లో వాడటం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతోందని ఆంథోనీ అన్నారు. బైబిల్ క్రైస్తవులకు ఒక పవిత్ర గ్రంథం. అలాంటిది కరీనా తన ప్రెగ్నెన్సీతో బైబిల్‌ను పోల్చడం సరికాదని పిటిషన్లో తెలిపారు.