NZB: నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైనట్లు ఒకటో పట్టణ SHO రఘుపతి బుధవారం తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.