TG: HYD పుప్పాల్ గూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోయింది. సర్వే నంబర్ 300లోకి బౌన్సర్లతో ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులు ధ్వంసం చేసింది. ప్రహరీగోడను కూలగొట్టింది. విషయం తెలుసుకున్న యజమానులు పొలం వద్దకు వెళ్లారు. వారిని బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ పొలం కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.