KRNL: సీ.బెళగల్ మండలంలో ఈనెల 26 నుంచి 30 వరకు నిర్వహించే ప్రత్యేక రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ వెంకటలక్ష్మి ఓ ప్రకటనలో కోరారు. 26న బెళగల్, 27న గుండ్రేవుల, 28న పోలకల్, బ్రాహ్మణదొడ్డి, 30న కొత్తకోట గ్రామాల్లో సదస్సులు జరుగుతాయని తెలిపారు. చుక్కల భూములు, ప్రభుత్వ భూముల సమస్యలను రైతులు పరిష్కరించుకోవచ్చన్నారు.