లిస్ట్-ఏ క్రికెట్లో సచిన్(60) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. ఆంధ్రాపై తన 58వ సెంచరీ చేసిన కోహ్లీ.. మరో 3 శతకాలు సాధిస్తే సచిన్ రికార్డు అతని సొంతమవుతుంది. ఇందుకు కోహ్లీ కనీసం 3 లిస్ట్-ఏ మ్యాచులు ఆడాల్సి ఉండగా.. అవి అడతాడా అనేది అనుమానమే. కాగా కోహ్లీ(53) ఇప్పటికే వన్డేల్లో సచిన్(49) సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.