NRML: కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరి రావును కాల్వ గ్రామ నూతన ఉపసర్పంచ్ కడ్తాల హరికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ క్యాంపు కార్యాలయంలో శ్రీహరి రావు శాలువా కప్పి ఉపసర్పంచ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు.