కృష్ణా: వేమవరం గ్రామంలో స్వచ్ఛ రథం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్లాస్టిక్ బాటిల్స్, పాత ఇనుము మొక్కలు స్వచ్ఛ రథానికి అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథం ద్వారా తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.