E.G: గోకవరం మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బావాజీపేట వద్ద రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో రాజేష్ అనే వ్యక్తి బైక్ పై నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై పవన్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి తరలించడం జరిగిందన్నారు.