MNCL: మంచిర్యాల నియోజకవర్గంలో 8 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొత్తగా 4 ఎత్తిపోతల పధకాలను ప్రభుత్వం మంజూరు చేసిందని MLA ప్రేమ్ సాగర్ రావు ఇవాళ ప్రకటనలో తెలిపారు. ఎత్తిపోతలకు మొత్తంగా రూ.74.40 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే నిర్మాణ పనులు చేపడుతామని పేర్కొన్నారు. దీంతో మరో 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియాజేశారు.