MDK: నిజాంపేట మండలంలో ఆధార్ సెంటర్ లేక గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ మండలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆధార్ మార్చుకోవడానికి, నూతన ఆధార్ కార్డులు పొందడానికి రామాయంపేట, దుబ్బాక, బీబీపేట మండలాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకుంటున్నారు. సొంత మండలంలోనే ఆధార్ సెంటర్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదంటున్నారు. ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు.