ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామానికి చెందిన గుంటుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుదవారం రాత్రి IOC పెట్రోల్ బంకు వద్ద వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ పై వెలుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాజేంద్ర(25) అనే వ్యకి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.