NLG: జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252 గందరగోళంగా ఉందని దానిని తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిట్యాలలో వారు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూడ వేణు పాల్గొన్నారు.