SRPT: సూర్యాపేట బంజారా భవన్లో టీజీయూఎస్ జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా బానోతు రామానాయక్, అధ్యక్షుడిగా కొర్ర భగ్గులాల్, ప్రధాన కార్యదర్శిగా భూక్యా జయంత్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.