బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ రౌడీషీటర్లకు కఠిన హెచ్చరిక చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లె పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఆయన, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే జిల్లా బహిష్కరణ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.