HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద టాయిలెట్లలో కేవలం మూత్రం పోసేందుకు రూ.30 వసూలు చేస్తున్నట్లు పలువురు నెటిజన్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీసం బోర్డు కూడా లేదన్నారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు ప్రత్యేక అధికారికి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ, పునరావృతం కాకుండా చూస్తామన్నారు.