GNTR: ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకం.