GNTR: పత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని హైవే రోడ్డుపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరునామా తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే పత్తిపాడు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.