KMM: పాలేరు నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉ.10 గంటలకు కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాల స్థలాలను పరిశీలిస్తారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:20కు ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.