గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 250 టెక్నికల్ పోస్టుల భర్తీని ఆసరాగా చేసుకుని దళారులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. కార్పొరేటర్లు, బ్రోకర్లు కలిసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నకిలీ ఐడీ కార్డులతో ఉద్యోగాలు ఇస్తామని వందలమంది నిరుద్యోగులను మోసం చేశారు. బాధితులు న్యాయం కోసం బల్దియా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది.