BPT: వేమూరు నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గురువారం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన శాంతి, ప్రేమ, కరుణ మార్గాలు మనందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపాలని, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.