KNR: బొమ్మకల్ గ్రామంలో పోచమ్మ ఆలయం నుంచి నాగార్జున డైరీ ఫామ్ వరకు గల రోడ్డు సమస్యకు నూతన సర్పంచ్ వేముల శ్రీకాంత్ పరిష్కారం చూపారు. గత ఏడాదిగా చెరువు మత్తడి నీరు నిలిచి, రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులు నరకయాతన అనుభవించేవారు. బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో డ్రైనేజీని క్లియర్ చేయించి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించారు.