ATP: తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఫ్యాక్షన్ గ్రామంగా పేరున్న వీరాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై కాటయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.