సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఎయిర్‌బోర్న్ ప్లైనాస్ 325 విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో 5 RDX ఐడియాలు అమర్చినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానంలో ఏ క్షణమైనా పేలవచ్చని, వెంటనే ప్రయాణికులను దింపండి అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో.. అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.