GNTR: అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 189.90 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గుంటూరులో 67.65 కి.మీ, పల్నాడులో 17.23 కి.మీ మేర రోడ్డు సాగనుంది.