జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మంచి హట్ అందుకుంది. గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు రాగా.. తాజాగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల ఎన్టీఆర్కు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.