VZM: పూసపాటిరేగ మండలంలో ఒక వివాహిత మృతి ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, పూసపాటిరేగ గ్రామానికి చెందిన పుష్పకు ఎరుకొండ గ్రామానికి చెందిన శివతో మూడు నెలల క్రితం వివాహమైంది. వరకట్న వేధింపుల ఆరోపణలపై మృతురాలి తల్లి రమ బుధవారం ఫిర్యాదు చేయగా, ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.