Gold Rates Today : మళ్లీ రూ.75 వేలు దాటిన బంగారం ధర!
గత కొంత కాలంగా కాస్త తగ్గుతున్నట్లుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎంతున్నాయో తెలియాలంటే ఇది పూర్తిగా చదివేయండి.
Gold and Silver Rates Today : అక్షయ తృతీయ డిమాండ్‌తో బంగారం ధరలు మళ్లీ రికార్డు ధరల్ని చేరుకుంటున్నాయి. ధర తగ్గినప్పుడు పసిడిని కొనుక్కోవాలని చూసే వారికి ఇది సరైన సమయం కాదనే చెప్పవచ్చు. మళ్లీ దీని ధర రూ.75 వేలు దాటి పైపైకి పోతోంది. శనివారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.500 పెరిగి రూ.75,270కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,270 కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని వినియోగదారులు గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శనివారం కాస్త తగ్గుముఖం పట్టింది. నేడు రూ.150 తగ్గి రూ.86,282కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్టణాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ క్రమంగా పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం ఎనిమిది డాలర్లు పెరిగి 2360 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర 28.9 డాలర్లుగా ఉంది.