మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు.. ఇక నుంచి రామ్ చరణ్ తేజ్ యువసేనాని అని సందడి చేస్తున్నారు మెగాభిమానులు. జనసేనాని కోసం పిఠాపురం వెళ్లిన చరణ్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీంతో యువసేనాని ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.
Ram Charan: జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో వాలిపోయింది టాలీవుడ్. పవన్‌కు మద్దతుగా చాలామంది సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. మెగా హీరోలు కూడా జోరుగా ప్రచారం చేశారు. అక్కడికి వెళ్లకపోయినా కూడా.. చాలామంది స్టార్ హీరోలు పవన్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ కూడా తన మద్దతు తెలిపాడు. ఇక ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయ్ రామ్ చరణ్ రంగంలోకి దిగాడు.
ఎన్నికల ప్రచారానికి చివరి రోజున.. తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం వెళ్లాడు చరణ్. రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో రామ్ చరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు మెగా ఫ్యాన్స్. అక్కడి నుంచి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నాడు చరణ్. ప్రస్తుతంత దారి పొడవున చరణ్‌కు స్వాగతం పలికిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో.. #RamCharan, #Pithapuram ట్యాగ్స్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఇక్కడి నుంచి చరణ్‌కు పొలిటికల్ ట్యాగ్ కూడా ఇచ్చేశారు మెగా ఫ్యాన్స్.
పవన్‌ని జనసేనాని అని పిలిస్తే, చరణ్‌ని యువసేనాని అంటూ కొత్త ట్యాగ్ పెట్టేసారు. దీంతో.. #YuvasenaniForJanasenani అనే ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా వరకు మెగా పవర్ స్టార్‌గా ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు బాబాయ్ కోసం యువసేనాని అయ్యాడంటూ.. రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పొలిటికల్‌గా పవన్ విజయం సాధిస్తే.. జనసేనానితో కలిసి యువసేనాని చేసే హంగామా మామూలుగా ఉండదనే చెప్పాలి.