TS RTC MD Sajjanar told RTC employees not to wear t-shirts and jeans on duty.
TS RTC MD Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. ఇకపై అందరూ ఉద్యోగస్తులు ఫార్మల్ డ్రెస్ ధరించాలని సూచించారు. విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దని సజ్జనార్ వెల్లడించారు. మాములుగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అందరూ ఖాకీ డ్రెస్సు ధరిస్తారు. ఇప్పటికీ చాలా మంది సీనియర్లు అది ఫాలో అవుతున్నారు. కానీ ఈ మధ్య కొందరు కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులు అలా కాకుండా సాధారణ దుస్తుల్లోనే విధులు నిర్వరిస్తున్నారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
ఇక నుంచి డ్యూటీలో ఉండే అందరూ ఆర్టీసీ ఉద్యోగులు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని, అది సంస్థకు, వ్యక్తిగతంగా ఉద్యోగులకు మంచి పేరును తీసుకొస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకురావడంతో బస్సులు నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. చాలా మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని సంగర్భాల్లో కండక్టర్లపై ప్రయాణికులు దాడులు చేస్తున్నారు. దుర్బాషలాడుతున్నారు. అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో సజ్జనార్ వెల్లడించారు.