»New Fashion Live Fish Dressing Netizens Comments Viral Video
Viral video: కొత్త ఫ్యాషన్ లైవ్ ఫిష్ డ్రెస్సింగ్..నెటిజన్ల విమర్శలు
మహిళల ఫ్యాషన్ డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకో మోడల్ డ్రెస్సులు మార్కెట్లోకి వస్తాయి. అయితే తాజాగా ఓ సరికొత్త డ్రైస్ వెలుగులోకి రాగా..అది చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫ్యాషన్ పేరుతో మూగ జీవాలు, జంతువులను ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు. అయితే ఆ క్రేజీ డ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
New fashion live fish dressing netizens comments viral video
ఓ మహిళ మత్స్యకన్య మాదిరిగా ఉన్న సరికొత్త ఫ్యాషన్ దుస్తులు(dress) ధరించింది. అయితే అది చూసిన నెటిజన్లు పలువురు మెచ్చుకుంటుండగా..అనేక మంది విమర్శిస్తున్నారు. ఆమె ధరించిన డ్రైస్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె లైవ్ ఫిష్‌తో కూడిన గౌను వంటి మోడల్ డ్రెస్సును వేసుకుంది. ఆ డ్రెస్సులోని ముందు భాగంలో ఓ పాత్ర జతచేయబడింది. అందులో నీరు పోసి వాటిలో చేపలను వేయడం ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. ఆ క్రమంలోనే స్త్రీ చేపలతోపాటు ఉన్న డ్రెస్ వేసుకుని ఫోటోలకు పోజులివ్వడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ నేపథ్యంలో యువతి చేపల భాగాన్ని తాకుతూ పలు రకాలుగా ఫోజులిస్తూ కెమెరాకు చిక్కింది.
ఈ వీడియోను సెప్టెంబర్ 30న ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా..ఇప్పటికే ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు దాదాపు నాలుగు లక్షలకుపైగా లైక్స్ కూడా వచ్చాయి. దీంతోపాటు ఈ వీడియో చూసిన పలువురు సరికొత్త మోడల్ డ్రైస్ అదుర్స్ అని కామెంట్లు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఫ్యాషన్ పేరుతో చేపలను అలా హింసించడం సరికాదని అంటున్నారు. మరికొంత మంది అయితే ఆ మహిళను విమర్శిస్తున్నారు. మీరు జంతువులను/చేపలను అలా ఉపయోగించకండి అంటూ హితవు పలుకుతున్నారు. ఇది క్రూరమైన చర్య అని అంటున్నారు. ఇంకొంత మంది అయితే దయచేసి ఇలాంటి ఫ్యాషన్ల పేరుతో మూర్ఖమైన చర్యలకు పాల్పడవద్దని అంటున్నారు. ఇది పూర్తిగా సృజనాత్మకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ డ్రెస్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్(comment) రూపంలో తెలియజేయండి మరి.