SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 29 జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, 18-25 ఏళ్ళ వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.