NEW LOGO : ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వారిపై కేసు.. లోగో ఫైనల్ కాలేదన్న సజ్జనార్
టీఎస్ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీగా పేరు మారిన తర్వాత కొత్త లోగో విషయంలో గందరగోళం నెలకొంది. ఫేక్ వీడియో క్రియేట్ చేసి గందరగోళం సృష్టించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
tsrtc md sajjanar Original ID card proof is mandatory for female bus passengers
Sajjanar Clarifies TSRTC New Logo Rumors : టీజీఎస్ ఆర్టీసీ లోగోపై వస్తున్న రూమర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీస్ ఆర్టీసీని టీజీఎస్ ఆర్టీసీగా(TGSRTC) పేరు మార్చామన్నారు. అయితే దీనికి సంబంధించిన లోగో ఇంకా ఫైనల్ కాలేదని ఆయన వెల్లడించారు. ఈ లోపుగా కొందరు వ్యక్తులు టీజీఎస్ ఆర్టీసీ లోగోను తయారు చేయగా అది వైరల్ అయ్యంది.
దీంతో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్న లోగో ఫేక్ లోగో అని సజ్జనార్(SAJJANAR) వెల్లడించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయమై పోస్ట్ చేశారు. ఆర్టీసీ సంస్థకు ఆ లోగోకు( LOGO) ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీజీఎస్ ఆర్టీసీ లోగోను తాము ఇంకా రూపొందించలేదని తెలిపారు. త్వరలోనే దాన్ని డిజైన్ చేయిస్తామని చెప్పారు. ఈ ఫేక్ లోగోలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ విషయమై టీజీఎస్ ఆర్టీసీ అధికారులు గురువారం చిక్కడపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను భంగ పరిచేలా ఫేక్ లోగో( LOGO) తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు హరీష్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్లపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై దర్యాప్తు కొనసాగుతోంది.