హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడింది. మొదటి ట్రిప్.. తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ చెప్పిన గొడవ పడింది.
TSRTC: హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడింది. కండక్టర్ ఇది మొదటి ట్రిప్.. తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ చెప్పారు. అయిన ఆ మహిళ ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడింది. దాడికి పాల్పడటంతో పాటు అసభ్య పదజాలంతో కండక్టర్ను దూషించింది. మర్డర్లు చేస్తా.. చంపేస్తానంటూ కండక్టర్ను బెదిరింపులకు గురిచేసింది.
బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ
హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరో మహిళా కండక్టర్ కూడా చెప్పినప్పటికీ ఆమె పట్ల కూడా ఆ మహిళా ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. తోటి ప్రయాణికులు చెబుతున్నా సరే.. మాట వినిపించుకోకుండా అసభ్య పదజాలంతో తిట్టింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు…
నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.